హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డుల జారీ నిలిపివేత
డిజిటల్ బ్యాంకింగ్ సేవల్లో తీవ్ర అంతరాయం
పరిష్కారం అయ్యేవరు లావాదేవీల నిలిపివేత
బ్యాంక్‌కు ఆర్‌బిఐ ఆదేశాలు జారీ
ముంబై,డిసెంబర్3 (జనంసాక్షి) : కొత్త క్రెడిట్ కార్డులివ్వొద్దని హెచ్ డీఎఫ్ సీ బ్యాంకును ఆర్బీఐ ఆదేశించింది. గత రెండేళ్లుగా హెచ్ డీఎఫ్ సీ ఇంటర్నెట్,మొబైల్ బ్యాంకింగ్ వంటి పేమెంట్ సేవలకు అంతరాయం కల్గుతున్నందును ఈ ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకింగ్ డిజిటల్ పేమెంట్స్‌లో లోపాలు ఉన్నందున సవరించే వరకు కొత్త కార్డులు జారీ చేయకూడదని ఆదేశించింది. అంతేగాకుండా హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్ కార్డు వినియోగదారులు బిల్లులను సరిగా కట్టడం లేదని గతంలో ఆర్బీఐకి ఫిర్యాదు చేసింది. నవంబర్ 21న బ్యాంక్ ప్రైమరీ డేటా సెంటర్లో విద్యుత్ నిలిచిపోవడంతో డిజిటల్ పేమెంట్స్ ఆగిపోయాయని..అందుకే ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసిందని హెచ్ డీఎఫ్ సీ తెలిపింది. కస్లమర్ల సమస్యలను పరిష్కరించి వారికి జవాబుదారితనంగా ఉండాలని బ్యాంకు బోర్డుకు తెలిపింది. ఈ మేరకు ప్రముఖ ప్రైవేటు రంగానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డిజిటల్ కార్య కలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. బ్యాంకుకు చెందిన డాటా సెంటర్‌లో గత నెల చోటుచేసుకున్న అంతరాయం నేపథ్యంలో ఈ చర్యలను తీసుకున్నట్టు తెలిసింది. ఈ ఆదేశాలతో బ్యాంకు నూతన క్రెడిట్ కార్డుల జారీకి కూడా బ్రేక్ పడింది. గత రెండు సంవత్సరాలుగా హెచ్‌డీఎఫ్‌సీకి సంబంధించిన ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, చెల్లింపులు తదితర కార్యకలాపాల్లో అంతరాయాలు చోటుచేసుకొంటున్నాయి. తాజాగా నవంబర్ 21న బ్యాంకు ప్రైమరీ డాటా సెంటర్‌లో విద్యుత్తు సరఫరా నిలిచిపోవటంతో ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, చెల్లింపుల్లో ఆటంకాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ తాజా ఆదేశాలు జారీచేసిందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వివరించింది. బ్యాంకు డిజిటల్ 2.0 కార్యక్రమంతో సహా ఇతర ఐటీ అప్లకేషన్ల పరిధిలోకి వచ్చే అన్ని కార్యకలాపాలు, నూతన క్రెడిట్ కార్డుల జారీని ప్రస్తుతానికి నిలిపివేయవలసిందిగా ఆర్బీఐ తన ఆదేశాల్లో పేర్కొంది. కాగా, పరిస్థితిని చక్కదిద్దేందుకు తాము పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వెల్లడించింది.