హెచ్‌డీఎఫ్‌సీ లాభాల్లో 20% వృద్ధి

4

ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌తో ముగిసిన తృతీయ త్రైమాసికం (క్యూ3)లో హెచ్‌డీిఎఫ్‌సీ బ్యాంకు నికర లాభాలు 20.1 శాతం వృద్ధితో రూ.3,356.8 కోట్ల నికర లాభాలు సాధించింది. అధిక వడ్డీ ఆదాయం సంస్థ లాభాలకు దన్నుగా నిలిచింది. ఈ ప్రయివేటు రంగ బ్యాంకు 2014-15 ఇదే క్యూ3లో రూ.2,791 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. క్రితం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ.18,282 కోట్లకు చేరింది. ఇంతక్రితం క్యూ3లో రూ.14,931 కోట్ల ఆదాయం నమోదు చేసుకుంది. క్రితం క్యూ3లో నికర వడ్డీపై ఆదాయం 24 శాతం పెరిగి రూ.7,068.5 కోట్లుగా నమోదయ్యింది. బ్యాంకు నికర నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) 0.29 శాతంగా చోటు చేసుకున్నాయి.