హెచ్‌సీయూకు మళ్లీ రాహుల్‌

5

– కొనసాగుతున్న ఆందోళనలు

హైదరాబాద్‌,జనవరి29(జనంసాక్షి): ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రానున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌ సింగ్‌తో కలసి రాహుల్‌ శుక్రవారం రాత్రి హెచ్‌సీయూకు చేరుకుంటారు. హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి హైదరాబాద్‌ కేంద్రీయ

విశ్వవిద్యాలయానికి రానున్నారు. హెచ్‌సీయూలో పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రోహిత్‌ తల్లి రాధికతో కలసి రాహుల్‌, దిగ్విజయ్‌ దీక్ష చేయనున్నారు.పీహెచ్‌డీ విద్యార్థి వేముల రోహిత్‌ ఆత్మహత్య నేపథ్యంలో ఈ నెల 19న రాహుల్‌ హెచ్‌సీయూలో పర్యటించిన సంగతి తెలిసిందే. రోహిత్‌ తల్లి రాధికను

పరామర్శించారు. రోహిత్‌ మృతికి కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని  డిమాండ్‌ చేశారు. అతని కుటుంబానికి పరిహారం చెల్లించడంతో పాటు ఉద్యోగం ఇవ్వాలని అన్నారు.

హెచ్‌సియూలో సడలని ఉద్రిక్తత

విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్సీయూలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుంది. శుక్రవారం పరిపాలన భవనం ఎదుట విద్యార్థులు ధర్నా చేశారు. వీసీ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థులు తరగతులు బహిష్కరించడం వల్ల సమస్య పరిష్కారం కాదని పరిపాలన భవనం సిబ్బంది స్పష్టం చేశారు. మరోవైపు పరిశోధక విద్యార్తులను అడ్డుకోవడం తగదని విద్యార్తులు అన్నారు. ఇంతకాలం తాము ఆందోళనలో పాల్గొన్‌ఆనమని, ఇకపోతే తమకు కూడా సహకరించాలన్నారు. విద్యార్థులు తరగతులకు హాజరుకాకపోవడం వల్ల ల్యాబ్లో ఉపయోగించే అత్యంత విలువైన కెమికల్స్‌ వృథా అవుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలకు సహకరిస్తే పరిష్కారం దొరుకుతుందని సిబ్బంది స్పష్టం చేశారు. కాగా రోహిత్‌ ఆత్మహత్యను నిరసిస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన సియం క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి సంఘాలు అనూహ్యంగా వచ్చి తెలంగాణ సిఎం క్యాంపుకార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశాయి. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. రోహిత్‌ ఆత్మహత్యపై సిఎం కెసిఆర్‌ స్పందించకపోవడంపై విద్యార్థి సంఘాలు సిఎం క్యాంప్‌ ఆఫీస్‌ ముట్టడికి పిలుపునిచ్చాయి. వారు చేపట్టిన ర్యాలీని అడ్డుకున్న పోలీసులు విద్యార్థులను అరెస్ట్‌ చేసి అక్కడి నుంచి తరలించారు. రోహిత్‌ ఆత్మహత్యకు కారణమైన వారిపై తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  దళిత విద్యార్థి రోహిత్‌ వేముల మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇప్పటి వరకూ స్పందించలేదని ఆక్షేపిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, భాజపా పార్టీలకు ప్రజలు బుద్ది చెబుతారన్నారు. కేంద్రమంత్రి దత్తాత్రేయను అరెస్టు చేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. ఆందోళనకు దిగిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఓ దళిత విద్యార్తి మరణిస్తే పలకరించే తీరిక కూడా సిఎం కెసిఆర్‌కు లేకపోవడం దారుణమన్నారు. విద్యార్థుల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదన్నారు. అందుకు కెసిఆర్‌ భారీ మూల్యం చెల్లించుకుంటారని విద్యార్థులు హెచ్చరించారు. రోహిత్‌ మృతికి నిరసనగా సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి వచ్చిన పలు విద్యార్థి సంఘాల నాయకులను పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌కుమార్‌ ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ రోహిత్‌ మృతికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, వీసీ అప్పారావులు కారణమని ఆరోపించారు. దత్తాత్రేయను వెంటనే కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని, వీసీ అప్పారావును సస్పెండు చేయాలని డిమాండ్‌ చేశారు.