హెచ్‌`1బీ వీసా ప్రోగ్రామ్‌లో మార్పులు

` లాటరీలో దుర్వినియోగానికి ఇక అడ్డుకట్ట
` ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అగ్రరాజ్యం
న్యూయార్క్‌ (జనంసాక్షి):హెచ్‌`1బీ వీసా ప్రోగ్రామ్‌లో మార్పులు తెస్తామని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధమవుతున్నాయి. త్వరలో ప్రభుత్వం వీటిన ప్రజాభిప్రాయ సేకరణ కోసం జనబాహుళ్యం ముందుకు తేనుంది. ఇందులో భాగంగా ఇకనుంచి పలు చోట్లనుంచి లాటరీ వేయకుండా నిరోధించనున్నారు.  రాబోయే మార్పులు ఏమిటనే అంశంలో అగ్రరాజ్యం ఇప్పటికే కొంత స్పష్టత నిచ్చింది. దరఖాస్తు దారులకు సమన్యాయం జరిగేలా, దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేలా ప్రతిపాదనలు రూపొందించామని తెలిపింది. దీంతో, ఈ మార్పులతో భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయన్న ఉత్కంఠ విదేశీ విద్యార్థుల్లో, ముఖ్యంగా భారతీయుల్లో నెలకొంది. ఈ విషయమై అమెరికా ఎన్నారైలు పలు కీలక వివరాలను వెల్లడిరచారు. తాజా ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఉద్యోగులు ఇప్పటిలా వీసా కోసం పలు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం ఉండదు. దీంతో,అందరికీ న్యాయం జరుగుతుంది. అంతేకాకుండా కంపెనీ యజమానులు కూడా తమ సంస్థ తరపున కొన్ని మినహాయింపులకు లోబడి వీసాకు దరఖాస్తు చేసుకోగలిగేలా అగ్రరాజ్యం నిబంధనలను సడలిస్తుంది. ఫలితంగా అనేక మంది హెచ్‌`1బీ వీసా ద్వారా అమెరికాలో తమ సంస్థలను అభివృద్ధి చేసుకునే అవకాశం దక్కుతుంది. తాజా ప్రతిపాదనల కారణంగా కంపెనీలు ఇకపై బహుళ దరఖాస్తులు సమర్పించి లాటరీ వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకోలేవని అక్కడి వారు చెబుతున్నారు. అభ్యర్థి తరఫున హెచ్‌`1బీ వీసా దరఖాస్తు చేసుకున్న సంస్థపై తనిఖీల అధికారాలు కల్పించే ప్రతిపాదనలను కూడా అమెరికా పరిశీలిస్తోంది. హెచ్‌`1బీ వీసా ఉద్యోగుల అవసరం నిజంగానే ఉందా లేక వ్యవస్థను దుర్వినియోగ పరిచేయ ప్రయత్నాలు జరుతున్నా యా అని తెలుసుకునేందుకు అధికారులు స్వయంగా కంపెనీల్లో తనిఖీలు నిర్వహించవచ్చు. అయితే, ఈ ప్రతిపాదనలు అన్నీ ప్రస్తుతం ప్రాథమిక పరిశీలన దశలోనే ఉన్నాయని అక్కడి వారు చెబుతున్నారు. అంతేకాకుండా ఏటా జారీ అయ్యే హెచ్‌`1బీ వీసాల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండదని చెబుతున్నారు. ఈ మార్పుల ముసాయిదా త్వరలో ప్రజల ముందుకు రానుంది. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం అమెరికా తుది మార్పులను ఖరారు చేస్తుంది.