హెల్మెట్ లేనందుకు బిజెపి ఎంపికి చలాన్
న్యూఢల్లీి,ఆగస్టు4(జనం సాక్షి ): బీజేపీ ఎంపీ మనోజ్ తివారీకి ఢల్లీి పోలీసులు ట్రాఫిక్ చలాన్ వేశారు. హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడిపిన కేసులో ఆ ఫైన్ వేశారు. ఎర్రకోట వద్ద జరిగిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో పాల్గొన్న ఎంపీ మనోజ్ తివారీ.. తలకు హెల్మెట్ లేకుండా బైక్ నడిపారు. అయితే ట్రాఫిక్ ఉల్లంఘన కింద ఆ ఎంపీకి చలాన్ పంపారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోను పోస్టు చేసిన ఎంపీ మనోజ్ తివారీ సారీ చెప్పారు. ్గªన్ కట్టనున్నట్లు కూడా వెల్లడిరచారు. హెల్మెట్ లేకుండా బైక్ నడపవద్దు అంటూ ఆ ఎంపీ తన ట్వీట్‌లో తెలిపారు. ఎంపీ నడిపిన బండికి లైసెన్సు, పొల్యూషన్, రిజిస్టేష్రన్ సర్టిఫికేట్ కూడా లేనట్లు తెలుస్తోంది.