హెల్మెట్ కంపల్సరీ

smeubajeసుప్రీం కోర్ట్ రోడ్డు బద్రత పై ఇచ్చిన ఆదేశాలను పాటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయ్యింది. ఇక నుంచి ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ కంపల్సరీ వాడాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం పై రోడ్ మీదకు వస్తే 1000 రూపాయల జరిమానా తో పాటు రెండుగంటల కౌన్సిలింగ్ తప్పదు. మీరు హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడుపుతున్నారా? ఉన్నా వాడటం లేదా? తస్మాత్ జాగ్రర్త! వెంటనే దుమ్ము దులుపి హెల్మెట్ ని సిద్ధం చేసుకోండి . ఇక నుండి హెల్మెట్ లేకుండా వాహనం నడిపినట్లయితే 1000 రూపాయిల జరిమానాతో పాటు రెండుగంటల కౌన్సిలింగ్ తప్పదు. ఒక వేల లేకుంటే వెంటనే వెళ్లి హెల్మెట్ కొనండి. అది కూడా ఐఎస్ఐ మార్క్ ఉన్నదీ మాత్రమే.

తరుచు జరుగుతున్నా రోడ్డు ప్రమాదాల్లో 24% మంది ద్విచక్ర వాహన దారులే మృత్యువాత పడుతున్నారు. ప్రజల్లో రోడ్డు భద్రత పై చితన్యం తేవాదానికి ప్రయత్నం చేసిన ఫలితం కనిపించటం లేదు దేశ వ్యాప్తం గా సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోవడం తో పాటు వేల మంది వైకల్యం పొందుతున్నారు. హెల్మెట్ వడక పోవడం తో మృతుల సంఖ్యా పెరుగుతోందని గుర్తించి హెల్మెట్ తప్పనిసరి చేస్తూ MVI act 129(F) ను తప్పనిసరి చేయాలని సుప్రీం కోర్ట్ ఆదేశాలను జారి చేసింది దీంతో తెలంగాణా రావాణాశాఖా చర్యలకు ఉపక్రమించింది. సెంట్రల్ వెహికిల్ ఆక్ట్ 138(F) ప్రకారం ఇక నుండి టు వీలర్ కొన్న వెంటనే డీలర్ తప్పని సరిగా వాహన కొనుగోలు దారునికి ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ వాహనం కొన్న వెంటనే వాహనం కొన్నా వెంటనే ఇయ్యాలి. అంతే కాక రిజిస్టేషన్ సమయం లో హెల్మెట్ ను తప్పనిసరిగా పరిశీలించాలి. గవర్నమెంట్ తీసుకున్నాఇ నిర్ణయానికి జనాల నుండి కూడా విశేష స్పందన వస్తుంది. హెల్మెట్ లేక చాల వరుకు ప్రమదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని హెల్మెట్ వాళ్ళ కొంత ప్రమాదాలను నివారించ వచ్చని జనాలు అంటున్నారు. వైద్యులు మాట్లాడుతూ ఆక్సిడెంట్లల్లో ఎక్కువగా తలకు గాయాలు కావటం వల్లనే చనిపోతున్నారని, బాడీ లో అన్ని అవయవాల్లలోకి తల చాల సునితం అయ్యిందని కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంటుందని అంటున్నారు. ప్రభుత్వం ఈ విధం అయిన నిర్ణయాన్ని తిసుకునందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రమాదాలను నివారించటానికి కటినంగా వ్యావహరిస్తున్నా సర్కార్ ఇక పై హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన అదే విధమయిన వైఖరితో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యింది.