హైకోర్టు తీర్పును స్వాగతించిన టిడిపి పోలిట్‌ బ్యూరో

మూడు రాజధానుల డ్రామా కట్టిపెట్టాలని డిమాండ్‌
హైకోర్టు తీర్పు మేరకునడుచుకోవాలన్న యనమల
అమరావతి,మార్చి3(జనం సాక్షి): రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును టీడీపీ పోలిట్‌ బ్యూరో స్వాగతించింది. గురువారం టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన పోలిట్‌ బ్యూరో సమావేశంª`లో తీర్పుపై చర్చించారు. హైకోర్టు తీర్పుపై పార్టీ పొలిట్‌బ్యూరో చర్చించింది. జగన్‌ ఇప్పటికైనా మూడు రాజధానులు అనే మోసాన్ని కట్టిపెట్టాలని సమావేశం డిమాండ్‌ చేసింది. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని ప్రకటించి వెంటనే అమరావతి నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేసింది. మూడు రాజధానుల పేరుతో ఇతర ప్రాంతాలను సీఎం మోసం చేశారని నేతలు చెబుతున్నారు. కోర్టు తీర్పును స్వాగతిస్తూ… రాజధాని నిర్మాణం ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ పోలిట్‌ బ్యూరో తీర్మానం చేసింది. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ వివరాలు వెల్లడిరచారు. ఇప్పటి వరకు టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఇన్స్యూరెన్స్‌ ద్వారా రూ.100 కోట్ల సాయం అందించినట్లు లోకేష్‌ వివరించారు. రాజధాని అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. గురువారం విూడియాతో మాట్లాడుతూ… ముందు నుంచి టీడీపీ మూడు రాజధానులు బిల్లు చెల్లదని చెబుతూనే ఉందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయం తీసుకొని, మూడు రాజధానులపై ముందుకు వెళ్ళిందని మండిపడ్డారు. హైకోర్టు తీర్పుతో నైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఆయన హితవుపలికారు. హైకోర్టు తీర్పును గౌరవించి ప్రభుత్వం ముందుకు వెళ్లాలని… మరో అప్పీల్‌కు వెళ్ళకూడదన్నారు. హైకోర్టు చెప్పిన విధంగా రాజధాని భూములు అభివృద్ధి చేసి ప్రభుత్వం రైతులకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. మూడు రాజధానుల ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధి నాశనమైందని యనమల రామకృష్ణుడు అన్నారు.
మూడు రాజధానులపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని శాసనమండలి మాజీ చైర్మన్‌ షరీఫ్‌ అన్నారు. విూడియాతో మాట్లాడుతూ…ఈ ప్రభుత్వం మూడు రాజధానుల విషయంలో ఇంత భంగపాటుకు గురైన తర్వాత బిల్లు పెట్టే సాహసం చేస్తుందని అనుకోవడం లేదన్నారు. ఇది అమరావతి రైతుల నైతిక
విజయమని తెలిపారు. ఆనాడు శాసనమండలిలో నిబంధనల ప్రకారం బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపామని చెప్పారు. అయితే తన నిర్ణయాన్ని ప్రభుత్వం తప్పు పట్టిందన్నారు. ఈ తీర్పుతో మొదటి నుంచి టీడీపీ వాదన కరెక్ట్‌ అని తేలిందని షరీఫ్‌ పేర్కొన్నారు.