హైకోర్టు తీర్పుపై రైతుల సంబరాలు

దీక్షాశిబిరం వద్ద బాణా సంచాకాల్చి ఆనందం
ఈ తీర్పుతో జగన్‌ కళ్లు తెరవాలని వినతి
అమరావతి,మార్చి3(జనం సాక్షి): ప్రభుత్వం మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టాల రద్దుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తీర్పు వెలువడిన వెంటనే అమరావతి రాజధాని పరిరక్షణ సమితి నాయకులు గత 807 రోజులుగా వెలగపూడిలో చేస్తున్న దీక్షా శిబిరం వద్ద సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చుతూ, స్వీట్లు పంచిపెట్టారు. హైకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతూ హైకోర్టు వద్ద సాష్టాంగ నమస్కారం చేశారు. న్యాయం, ధర్మం గెలిచిందని నినాదాలు చేశారు. న్యాయం బ్రతికే ఉందని కోర్టు మరోసారి నిరూపించిందని నాయకులు పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్‌ అమరావతి రైతులపై త్రాచుపాములా పగబట్టారని ఇప్పటికైని పంతాలకు పోయి రాష్టాన్న్రి నాశనం చేయొద్దని న్నారు. కామధేనువు లాంటి అమరావతిని అభివృద్ధి చేయాలని సూచించారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఆరు నెలల వరకు ప్రభుత్వం తమ ప్లాట్లను అభివృద్ధి చేసేంతవరకు తమ ఆందోళనను కొనసాగిస్తుందని వెల్లడిరచారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితిలో లేమని, ప్రభుత్వం ఇంకా పైకోర్టుకు వెళితే తాము కూడా వెళ్తామని, అంతిమంగా ఏపీకి రాజధాని అమరావతే అయ్యేంతరకు తమ ఆందోళన కొనసాగుతుందని పేర్కొన్నారు. 2019 డిసెంబర్‌ 17న ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ప్రకటిస్తు నిర్ణయం తీసుకోవడంతో అప్పటి నుంచి 807 రోజులుగా వెలగపూడి గ్రామంలో రైతులు దీక్షను నిర్వహిస్తున్నారు.
రైతు గెలిచాడు.. అమరావతి నిలిచిందని అన్నారు. 807 రోజులుగా ఏపీ రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించిందన్నారు. అమరావతిపై గురువారం హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా వెలగపూడి గ్రామానికి చెందిన రైతులు మాట్లాడుతూ తమ ఉద్యమానికి మద్దుతుగా నిలిచిన వివిధ పార్టీల నేతలు, విూడియాకు పాదాభివందనాలు తెలిపారు. హైకోర్టు తీర్పుతోనైనా జగన్‌ ప్రభుత్వం మారాలని, సీఆర్డీయే చట్టం ప్రకారం తమకు న్యాయం చేయాలని కోరారు. ఇప్పటికైనా ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని జగన్‌
ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఇంతవరకు తాము పండుగలు చేసుకోలేదని, ఈ రోజే తమకు పండగ రోజని రైతులు పేర్కొన్నారు. ఈ విజయం రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజలదని అన్నారు.