హైటెక్స్‌లో అగ్రిటెక్స్ ప్రారంభం
హైదరాబాద్,సెప్టెంబర్5 (జనం సాక్షి ) : హైటెక్స్‌లో మూడు రోజుల పాటు జరగనున్న అగ్రిటెక్స్ 7వ ఎడిషన్ ఎగ్జిబిషన్ ను మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. అగ్రిటెక్స్ 7వ ఎడిషన్ 3 రోజుల పాటు హైటెక్స్ ఎక్సబిషన్ సెంటర్ లో జరగనుంది. వ్యవసాయం, పాడి పరిశ్రమ, ఉద్యాన, ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా కల్చర్, అంతర్జాతీయ మహా ప్రదర్శన జరగనుంది. యూకే, ఇటలీ, నెదర్లాండ్స్, ఆస్టేల్రియా నుండి పెట్టుబడిదారులు ఎగ్జిబిటర్లు సమావేశం కానున్నారు. మూడ్రోజుల పాటు మార్కెట్ కు తగిన వ్యూహ నిర్మాణ అవకాశాలు సాంకేతిక అభివృద్ధిపై వివిధ దేశాల వ్యవసాయ నిపుణులతో సంప్రదింపులు, అధునాతన వ్యవసాయ అన్వేషణ, పాడి, ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా కల్చర్, హార్టికల్చర్, విజ్ఞాన సదస్సులపై సమావేశాలు నిర్వహించనున్నారు.