.హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఇవ్వకపోతే అంతుచూస్తాం

` భారత్‌పై ప్రతీకారం తప్పదన్న ట్రంప్‌
వాషింగ్టన్‌,ఏప్రిల్‌ 7(జనంసాక్షి):కొవిడ్‌`19 రోగుకు చికిత్స చేయడం కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రల్ని సరఫరా చేయాన్న అమెరికా విజ్ఞప్తిని భారత్‌ మన్నించకపోతే అది తనను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అమెరికాతో భారత్‌ ఎప్పుడూ సరైన రీతిలోనే వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘’ఒకవేళ ఔషధాల్ని సరఫరా చేయొద్దన్నదే ఆయన(మోదీ) నిర్ణయమైతే.. అది నన్ను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆదివారం ఆయనతో మాట్లాడాను. క్లోరోక్విన్‌ అవసరాన్ని వివరించాను. అమెరికాకు సరఫరా చేయాని కోరాను. ఒకవేళ ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేయకపోతే.. చూద్దాం. కానీ, దానికి ప్రతీకారం ఉండొచ్చు. ఎందుకు ఉండకూడదు?’’ అని సోమవారం శ్వేతసౌధంలో విలేకరుతో మాట్లాడుతూ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు ఔషధ రంగంలో అమెరికాకు భారత్‌ సుదీర్ఘకాం నుంచి ప్రధాన భాగస్వామ్యపక్షంగా కొనసాగుతోందని యూఎస్‌ విదేశాంగశాఖలోని ఉన్నతాధికారి అలైస్‌ జీ వెల్స్‌ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే పరంపర కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాలో ఇప్పటి వరకు 3,67,461 మంది వైరస్‌ బారినపడ్డారు. వీరిలో 10,910 మంది మృతిచెందారు.కరోనా పరిస్థితుపై ఇరుదేశాధినేతు ఆదివారం ఫోన్‌లో చర్చించిన విషయం తెలిసిందే. కొవిడ్‌`19 చికిత్స కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రల్ని తమకు సరఫరా చేయాని ఈ సందర్భంగా ట్రంప్‌ భారత్‌ను కోరారు. అయితే, ఈ ఔషధం సహా కరోనా చికిత్సలో ఉపయోగపడే ఇతర మందు ఎగుమతిపై భారత్‌ నిషేధం విధించింది. ఈ ఇన్‌ఫెక్షన్‌కు టీకా, ఔషధం లేకపోవడంతో హైడ్రాక్సిక్లోరోక్విన్‌పై ట్రంప్‌ ఆశు పెట్టుకున్నారు. ఈ ఔషధాన్ని మలేరియాకు చికిత్స చేసేందుకు ఉపయోగిస్తున్నారు. కొవిడ్‌`19 రోగుకు ఇతర ఔషధాతో కలిపి హైడ్రాక్సిక్లోరోక్విన్‌ను కూడా ఇవ్వాని అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) సూచించింది. దీంతో అమెరికా ఇప్పటికే 29 మిలియన్‌ డోసు మేర హైడ్రాక్సిక్లోరోక్విన్‌ను న్వి చేసి పెట్టుకుందని స్వయంగా ట్రంపే వ్లెడిరచారు. కరోనా రోగు, అనుమానితుకు చికిత్స చేస్తున్న సిబ్బందికి, రోగు దగ్గరగా వచ్చిన బంధువుకు ఈ మందును ఇవ్వాని భారత వైద్య పరిశోధన మండలి కూడా సూచించింది.హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాని మరికొన్ని దేశా నుంచి కూడా విజ్ఞప్తు వస్తున్నాయి. మరోవైపు భారత్‌లోనూ కరోనా మహమ్మారి రోజురోజుకీ తన ఉనికిని విస్తరిస్తూ పోతోంది. అత్యధిక జనాభా కలిగిన భారత్‌ వంటి దేశాల్లో వైరస్‌ను కట్టడి చేయాంటే వ్యూహాత్మక ఔషధ న్విు భారీ స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఈ పరిణామా నేపథ్యంలో భారత్‌ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.