హైదరబాద్ మరో విజయం
– టాటా బోయింగ్ ఏరోస్పేస్ యూనిట్‌కు శంకుస్థాపన
– వైమానిక రంగానికి హైదరాబాద్ తలమానికం
– పారికర్
– పారదర్శకంగా పారిశ్రామిక అనుమతులు
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్,జూన్ 18(జనంసాక్షి): టాటా బోయింగ్ ఏరోస్పేస్ యూనిట్ ద్వారా దేశ వైమానికరంగానికి తలమానికంగా మారనుందని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ఈ ప్రాజెక్టు అపాచీ, హెలికాఫ్టర్ల ప్రధాన భాగాలను తయారు చేయడానికి బోయింగ్, టాటా అడ్వాన్‌స్డ్ సిస్టమ్స్తో ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఈ యూనిట్‌ను 13 ఎకరాల విస్తీర్ణంలో రూ.400 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. ఆదిభట్లలో శనివారం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుతో వైమానిక రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని అన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో పారిశ్రామిక విధానం చాలా బాగుందని కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ ఈ సందర్బంగా అన్నారు. తెలంగాణలో నూతన పారిశ్రామిక విధానం స్నేహపూర్వకంగా ఉందని కితాబిచ్చారు. రాష్టాన్రికి కేంద్రం నుంచి అవసరమైన సహాయం అందిస్తామని హావిూ ఇచ్చారు. రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను అనుమతించడం సరైన పక్రియగా పేర్కొన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో బోయింగ్‌కు శంకుస్థాపన జరిగిందన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో స్పష్టమైన విధానాలుండాలని, ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. దీంతో భాగ్యనగరం సిగలో మరో ఆణిముత్యం చోటుచేసుకుంది. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టీఎస్ ఐ పాస్‌కు స్పందించిన టాటా సంస్థ నగరంలో వైమానిక విడిభాగాల తయారీ సంస్థను స్థాపించాలని నిర్ణయించింది. ఈమేరకు ఆదిబట్లలో ఏర్పాటు చేయనున్న టాటా బోయింగ్ ఏరో స్పేస్ విడి భాగాల తయారీ యూనిట్‌కు కేంద్ర మంత్రి మనోహర్‌పారికర్, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన చేశారు. ఈ యూనిట్ నిర్మాణం కోసం రూ.2 వందల కోట్లు వెచ్చించనున్నారు. మూడు నెలల్లో పనులు పూర్తి కానున్నాయి. తమ టీఆర్‌ఎస్ ప్రభుత్వం టీ ఎస్ ఐ పాస్ ద్వారా తెలంగాణ రాష్టాన్న్రి పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లేందుకు అనేక చర్యలు చేపడుతోందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. టీ ఎస్ ఐ పాస్ ద్వారా పన్నెండు రోజుల్లోనే పరిశ్రమలకు పారద్శకంగా అనుమతులిస్తున్నామని వెల్లడించారు. టాటా బోయింగ్ వైమానిక విడిభాగాల సంస్థ తెలంగాణకు రావడం సంతోషంగా ఉందన్నారు. విమాన విడి భాగాల సంస్థ తెలంగాణకు రావడంతో తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. ప్రభుత్వంతో టాటా బోయింగ్ కంపెనీ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని పరిశ్రమలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, ఆదిబట్లలో ఈ వైమానిక విడి భాగాల ఉత్పత్తి సంస్థను రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. రెండు నెలల్లో యూనిట్ నిర్మాణం పూర్తయితే ఉత్పత్తి ప్రారంభిస్తుందని భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా పారిశ్రామిక అనుమతులు ఇస్తోందనడనికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదన్నారు. దీంతో పెట్టుబడులకు తెలంగాణ అనుకూలంగా మారిందని ఐటీ శాఖమంత్రి కేటీఆర్ తెలిపారు. అందుకే అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని ఆయన తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా తెలంగాణ రాష్టాన్న్రి పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లేందుకు అనేక చర్యలు చేపడుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. టాటా బోయింగ్ వైమానిక విడి భాగాల సంస్థ తెలంగాణకు రావడం సంతోషకరమన్నారు. దీంతో తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తమైందని ఆయన పేర్కొన్నారు. అలాగే పరిశ్రమల శాఖ విషయంలో గత ఏడాది వృద్ధిని సాధించామని, ఇక వచ్చే ఏడాదిపై దృష్టి పెట్టామన్నారు. అలాగే అపాచీ, హెలికాప్టర్ల ప్రధాన భాగాన్ని తయారు చేయడానికి బోయింగ్, టాటా అడ్వాన్‌స్డ్ సిస్టమ్స్తో ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డితోపాటు ఎంపీ బూర నర్సయ్యగౌడ్,
పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.




