హైదరాబాదులో ఎన్టీఆర్ గార్డెన్ అలాగే ఉంటుంది: కేసీఆర్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్న ఎన్టీఆర్ గార్డెన్ ఎప్పటికీ అక్కడే, అలాగే ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ కుమారుడు, హీరో బాలకృష్ణ 100వ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఎన్టీఆర్‌ను తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తిగా అభివర్ణిస్తూ తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఎన్టీఆర్ గార్డెన్ ఎప్పటికీ ఉంటుందని తేల్చి చెప్పారు.