హైదరాబాద్‌పై ఆంధ్రుల పెత్తనం సహించం
ఓటుకు నోటు నుంచి తప్పించుకునేందుకు సెక్షన్ 8 – ప్రొఫెసర్ కోదండరామ్
హైదరాబాద్, జూన్ 28
(జనంసాక్షి)
ఓటుకు నోటు కేసును పక్కదారి పట్టించేందుకే సెక్షన్-8ను తెరపైకి తెచ్చారని పొలిటికల్ జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదం డరామ్ అన్నారు. ఆదివారం నాంపల్లిలోని టీజీవో భవన్‌లో తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో సెక్షన్-8పై రౌండ్ టేబు ల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీఆర్‌ఎస్ జన రల్ సెక్రెటరీ, ఎంపీ కేకే, ప్రొఫెసర్ కోదండ రామ్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, దేవీప్రసాద్, తదితరులు హాజర య్యారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయినా తెలుగు ప్రజలు కలిసే ఉన్నారని అన్నారు. కేంద్రం మొండిగా సెక్షన్-8పై ముందెకెళ్తే జేఏసీ ప్రతిఘటిస్తుందని తేల్చి చెప్పారు. ఓటుకు నోటు కేసులో టి. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అడ్డం గా దొరికిపోయారని, ఈ విషయంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందని ఎంపీ కె. కేశవరావు స్పష్టం చేశారు. సెక్షన్-8పై గవర్నర్‌కు బాధ్యతలు మాత్రమే ఉంటాయన్న ఆ యన ఓటుకు నోటు కేసును అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్నారు. హైదరాబాద్‌లో ఎవరైనా ఉండొచ్చు కానీ.. హైదరాబాద్ తెలంగాణ సొత్తు కేకే ఉద్ఘాటించారు. ఏడాది తర్వాత, ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న తరువాత చంద్రబాబుకు సెక్షన్-8 గుర్తుకొచ్చిందని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. హైదరాబాద్‌లో ప్రజల మధ్య గొడవలు సృష్టించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.