హైదరాబాద్‌లో చిచ్చుపెట్టే యత్నం
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్,జనవరి29(జనంసాక్షి): హైదరాబాద్‌లో ఉన్న వారందరిని సమానంగా చూస్తున్నామని,అయితే కొందరు కావాలనే విభేదాలు సృష్టించాలని చూస్తున్‌ఆనరని మంత్రి కేటీఆర్ అన్నారు. చందానగర్‌లో రోడ్‌షోలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌కు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘తెలంగాణ వస్తే ఆంధ్రవారి ఆస్తులు లాక్కుంటారు, వెళ్లగొడతారని మాట్లాడారు. తెలంగాణ వస్తే చీకట్లోకి వెళ్తుందని హేళన చేశారు’. ఇక్కడ స్థిరపడిన వాళ్లపై ఈగ వాలకుండా చూసుకుంటున్నామన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా వల్ల ఉద్యోగాలు, ఐటీ పెట్టుబడులు పెరిగాయన్నారు. బల్దియా ఎన్నికల్లో తెరాసను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్‌లో కరెంట్, నీటి బకాయిలు మాఫీ చేసి పేదలకుఅ అండగా నిలిచామని అన్నారు. 60 ఏండ్లలో టీడీపీ, కాంగ్రెస్ చేసిందేమి లేదు. 60 ఏండ్ల దారిద్య్రం 18 నెలల్లో పోతదా? తెలంగాణ వస్తే అంధకారమవుతుందని కొందరు విమర్శించారు. రాష్ట్రంలో రెప్పపాటు కోత లేకుండా కరెంట్‌ను సరఫరా చేస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌కు దక్కిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానం వల్ల రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించి.. అభివృద్ధిలో భాగస్వాములవుదామని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చెప్పారు. చందానగర్‌లో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్‌లు స్వార్థ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఇంటి పార్టీని గెలిపించుకుని విపక్షాలకు బుద్ధి చెప్పాలని సూచించారు. సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని చెప్పారు.