హైదరాబాద్‌లో పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సు
– గవర్నర్‌ను ఆహ్వానించిన టీఎస్‌పీఎస్సీ చైర్మన్
హైదరాబాద్,జనవరి 2(జనంసాక్షి): గవర్నర్ నరసింహన్‌తో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి సమావేశమయ్యారు. 2015 టీఎస్‌పీఎస్సీ రిపోర్టును గవర్నర్‌కు సమర్పించారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ప్రభుత్వం సూచిస్తే డీఎస్సీ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఖాళీలను అందిస్తే వెంటనే భర్తీ చేయడానికి రెడీ అని వెల్లడించారు. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాతీయ సదస్సు ఉంటుందని చెప్పారు. గత ఏడాది తొమ్మిది నోటిఫికేషన్లతో రెండు వేల ఉద్యోగాలు కల్పించామని వివరించారు. ఇప్పటివరకు అనేక సమస్యలను అధిగమించి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నామని అన్నారు. అయినా అనేక పోస్టుల భర్తీని సక్రమంగా పారదర్శకంగా చేపట్టామని అన్నారు. డీఎస్సీ నిర్వహణపై ప్రభుత్వం నుంచి సంకేతాలు అందాయి. డీఎస్సీ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఖాళీలను అందిస్తే వెంటనే భర్తీ చేస్తామని వెల్లడించారు. ఫిబ్రవరి 4, 5 తేదీల్లో హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. జాతీయ సదస్సుకు గవర్నర్ నరసింహన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించామన్నారు. కాన్ఫరెన్స్‌కు 29 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్లు హాజరవుతారని పేర్కొన్నారు. సదస్సులో పరీక్షల విధానం, ఇతర సంస్కరణలపై చర్చ జరుగుతుందన్నారు. గత ఏడాది తొమ్మిది నోటిఫికేషన్లతో రెండు వేల ఉద్యోగాలు కల్పించామని వివరించారు. టీఎస్‌పీఎస్సీ ఏర్పడిన మొదటి ఏడాదిలోనే రెండు అవార్డులు వచ్చినందుకు గవర్నర్ అభినందించారని తెలిపారు.