హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతుంది. రాష్ట్రంపై ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతుండటంతో వానలు కురుస్తున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, ఎల్బీనగర్, తార్నాక, ఛత్రినాక, చార్మినార్, ఉప్పుగూడ, ఉప్పల్, జీడిమెట్ల, కూకట్‌పల్లి, హయత్‌నగర్, కర్మన్‌ఘాట్‌తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌జాం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరుకుంటుంది.