హైదరాబాద్‌లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని బీజేపీ గ్రేటర్‌ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. బర్కత్‌పురాలోని గ్రేటర్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. రానున్నది ఎన్నికల కాలమని, కార్యకర్తలు పార్టీ గెలిపించేందుకు సమాయత్తం కావాలని పిలునునిచ్చారు.