హైదరాబాద్‌లో భారీ వర్షం

11S

హైదరాబాద్‌,సెప్టెంబర్‌11 (జనంసాక్షి):

రాగల 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోందని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో మరో రెండ్రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అల్పపీడనం ఏర్పడితే తెలుగు రాష్టాల్ల్రో విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌  నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఇవాళ సాయంత్రం కుషాయిగూడ, ఈసీఐఎల్‌, మల్కాజిగిరి, నేరెడ్‌మెట్‌, దిల్‌షుఖ్‌నగర్‌, కొత్తపేట, సరూర్‌నగర్‌, కోఠి, నాంపల్లి, బషీర్‌బాగ్‌, లక్డీకాపూల్‌, అబిడ్స్‌, సుల్తాన్‌బజార్‌, బేగంబజార్‌, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, అవిూర్‌పేట్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, సనత్‌నగర్‌, బోరబండ, కూకట్‌పల్లి, షేక్‌పేట, కూకట్‌పల్లి, షేక్‌పేట, జూబ్లీహిల్స్‌, బంజారా హిల్స్‌, మెహిదీపట్నం, కార్వాన్‌, సికింద్రాబాద్‌లోని చిలకలగూడ, పద్మారావునగర్‌, పార్సిగుట్ట, తుకారాం గేట్‌, అడ్డగుట్ట, ప్యారాడైజ్‌, తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో రహదారులు జలమయయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌ నుంచి కోస్తాంధ్ర విూదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీనికి తోడు రాయలసీమలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు సైతం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లోని పామిడిలో 8 సెంటీవిూటర్లు, జూపాడు బంగ్లా, గోనెగండ్ల, భీమడోలులో 6 సెం.విూ, ముడ్లమూరు, కనేకల్‌, నందవరంలో 5 సెం.విూ, శ్రీశైలం, ఆళ్లగడ్డ, ఏలూరు, మాచర్లలో 4 సెం.విూల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలోని ఎల్‌ బ్లాక్‌ సవిూపంలో శుక్రవారం మధ్యాహ్నం ఓ వృక్షం నేలకొరిగింది. ఈ ఘటనలో ఓ కారు పాక్షికంగా ధ్వంసమైంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే వృక్షం కూలిందని అధికారులు చెబుతున్నారు.