హైదరాబాద్‌లో మరో పెద్ద దవాఖానా
హైదరాబాద్ ఏప్రిల్25(జనంసాక్షి):
హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించేందుకు బ్రిటన్‌కు చెం దిన ఇండో-యూకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ ఛైర్మన్ మైక్ పార్కర్, సీఈవో అజయ్ రంజన్ గుప్తాతో పాటు బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ మైక్ నితావ్రికాన్సిస్ తదితరులు సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావే శమయ్యారు. అనంతరం వారు తమ ప్రతిపాదనలను సీఎంకు వివరించారు.పూర్తిగా విదేశీ ప్రత్యక్ష పెట్టు బడులతో అన్ని హంగులతో ఈ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని, అవసరమైన స్థలం ఇవ్వాలని కేసీఆర్‌ను కోరారు.




