హైదరాబాద్‌లో మేయర్‌ అర్ధరాత్రి పర్యటన

హైదరాబాద్‌ : జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణంలో ఉన్న రహదారులను మేయర్ బొంతు రామ్మోహన్‌, పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ శుక్రవారం అర్ధరాత్రి పరిశీలించారు. జూబ్లీహిల్స్, నల్గొండ ఫ్లైఓవర్, మజీద్ బండ ప్రాంతాల్లో జరుగుతున్న రహదారి నిర్మాణ పనుల్లో నాణ్యతను పరిశీలించారు. సకాలంలో పనులను పూర్తి చేయడంతో పాటు… నాణ్యత విషయంలో రాజీపడొద్దని గుత్తేదారులకు సూచించారు. వర్షాకాలంలోపే  రహదారుల మరమ్మతులను పూర్తి చేస్తామని మేయర్ తెలిపారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీళ్లు నిలుస్తున్నాయని… ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అవసరమైన చోట జర్మన్ సాంకేతికతతో రహదారులు, వైట్ టాపింగ్ రహదారులు నిర్మిస్తున్నట్లు తెలిపారు.

తాజావార్తలు