హైదరాబాద్‌లో 200 మిలియన్‌ డాలర్లతో డీఈషా కంపెనీ పెట్టుబడి

4

– మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,మే8(జనంసాక్షి): పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ మంత్రి కెటిఆర్‌ అమెరికా పర్యటన కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 200 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు అమెరికా కంపెనీ డీఈషా ఆసక్తి చూపుతోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. బ్లాక్‌ స్టోన్‌తో  కలసి ఉమ్మడి సంస్థ ఏర్పాటు చేయాలని డీఈషా నిర్ణయం తీసుకున్నట్టు కేఈఆర్‌ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంతో పనిచేసేందుకు మాస్టర్‌ కార్ట్‌ సిద్ధంగా ఉందని కేటీఆర్‌ తెలిపారు. సైబర్‌ సెక్యూరిటీ సంస్ధ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు.  న్యూయార్క్‌లో డీఈషా కంపెనీ ఎండీతో మంత్రి కేటీఆర్‌ సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో సంస్థ కార్యకలాపాలు విస్తరించాలని కేటీఆర్‌ కోరారు. అనుబంధ కంపెనీ ఆర్కీసీయం ద్వారా 200మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి సంస్థ అంగీకారం తెలిపింది. హైదరాబాద్‌లో త్వరలోనే కంపెనీ ప్రారంభమవుతుందని డీఈషా ఎండీ తెలిపారు. మాస్టర్‌ కార్డ్‌ సంస్థ అధ్యక్షుడు అజర్‌ బంగాతో కేటీఆర్‌ సమావేశమయ్యారు. సైబర్‌ సెక్యూరిటీలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నమని బంగా పేర్కొన్నారు. మాస్టర్‌ కార్డ్‌ వంటి సంస్థతో కలిసి పనిచేసే అంశాన్ని స్వాగతిస్తున్నామని కేటీఆర్‌ చెప్పారు. రాష్ట్రానికి గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా విన్నర్స్‌ ఉండాలని కేటీఆర్‌ తెలిపారు. చారిత్రక కట్టడాల పరిరక్షణ కోసం విన్నర్స్‌ పని చేస్తుంది. ప్రతిపాదనకు ఒప్పుకుని సేవలు అందిస్తామని కంపెనీ అధినేత ఫ్రాంక్‌ వింటర్‌ పేర్కొన్నారు. ఇదిలావుంటే తెలంగాణలో అభివృద్ది లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. విద్యుత్‌ కోతలు లేకుండా చేశామన్నారు. తెలంగాణ ఏర్పడితే విద్యుత్‌ కోతలు ఉంటాయని, రాస్ట్రం అదంకారం అవుతుందని హెచ్చరించిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి రాజకీయ జీవితం అందకరామయ్యిందని కెటిఆర్‌ ఎద్దేవా చేశారు.  పెట్టుబడులకు తెలంగాణ అనుకూలంగా ఉందన్నారు.