హైదరాబాద్‌ కలెక్టర్‌గా యోగితా రాణా

హైదరాబాద్‌: హైదరాబాద్‌ కలెక్టర్‌గా యోగితారాణాను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆమె ప్రస్తుతం నిజామాబాద్‌ కలెక్టర్‌గా ఉన్నారు. యోగితా రాణా బదిలీ కావడంతో నిజామాబాద్‌ కలెక్టర్‌ బాధ్యతలను తాత్కాలికంగా జాయింట్‌ కలెక్టర్‌కు అప్పగించారు.