హైదరాబాద్‌ చుట్టుపక్క జరభద్రం

` హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాు ప్రధానం

` కర్నూు, గుంటూరు జిల్లాతో సరిహద్దు పంచుకున్న తెంగాణ గ్రామాల్లో పటిష్ట చర్యు తీసుకోవాలి

` ఆ ప్రాంతాల్లో ప్రత్యేక అధికారును నియమించి నియంత్రణ చర్యు చేపట్టాలి

` ఎవరు కూడా హైదరాబాద్‌కు రాకుండా చూడాలి

` సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష

హైదరాబాద్‌,మే 6(జనంసాక్షి):కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌, దాని చుట్టుపక్క ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యు పాటించాని ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధికారును ఆదేశించారు. హైదరాబాద్‌ నగరంతో పాటు కర్నూుకు సరిహద్దులో గ గ్రామాల్లో, గుంటూరు జిల్లాకు సరిహద్దులో గ గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ, లాక్‌ డౌన్‌ అము, సహాయక చర్యపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రగతి భవన్‌ లో బుధవారం ఉన్నత స్థాయి సవిూక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈట రాజేందర్‌, ప్రభుత్వ ముఖ్య సహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, డిజిపి మహేందర్‌ రెడ్డి, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, ముఖ్య కార్యదర్శు ఎస్‌ నర్సింగ్‌ రావు, రామకృష్ణారావు  తదితయి పాల్గొన్నారు. ‘‘హైదరాబాద్‌ దాని చుట్టుపక్క జిల్లాు మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరిస్థితి అదుపులోనే ఉంది. ఆ ప్రాంతాల్లో వ్యాప్తి చాలా తక్కువగా ఉంది. కొత్తగా నమోదవుతున్న కేసున్నీ హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లోనే ఉన్నాయి. కాబట్టీ అధికాయి హైదరాబాద్‌ పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎవరికి వ్యాధి క్షణాు కనిపించినా వెంటనే పరీక్షు జరిపి అవసరమైతే చికిత్స చేయించాలి. ఎవరు పాజిటివ్‌ గా తేలినా అతను కలిసిన వారందరినీ క్వారన్‌ టైన్‌ చేయాలి. హైదరాబాద్‌ లోని వారు బయటకు పోకుండా, బయటివారు హైదరాబాద్‌ లోనికి రాకుండా నియంత్రణ చర్యు పకడ్బందీగా చేపట్టాలి. చురుకైన పోలీసు అధికాయి, వైద్య ఆరోగ్య శాఖ అధికాయి, ఐఎఎస్‌ అధికారును ప్రత్యేకాధికాయిగా నియియమిచాలి. మొత్తం హైదరాబాద్‌ ను చుట్టుముట్టాలి. వైరస్‌ ను తుదముట్టించాలి ‘’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘‘పక్క రాష్ట్రంలోని కర్నూు పట్టణం, గుంటూరు జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. వాటికి సరిహద్దుల్లోనే తెంగాణ  గ్రామాున్నాయి. ఈ రెండు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక అధికారును నియమించి నియంత్రణ చర్యు చేపట్టాలి. అటువారెవరు ఇటు రాకుండా, ఇటువారెవరు అటు పోకుండా నియంత్రించాలి. వైరస్‌ మన దగ్గర పుట్టింది కాదు. ఇతర ప్రాంతా నుంచి వ్యాప్తి చెందేదే. కాబట్టీ ప్రజ రాకపోకను ఎంత కట్టుదిట్టంగా నియంత్రించగలిగితే వైరస్‌ వ్యాప్తిని అంత బాగా అరికట్టవచ్చు’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

తెంగాణలో కొత్తగా 11 పాజిటివ్‌ కేసు` అన్ని జీహెచ్‌ఎంసీ పరిధిలోనే

తెంగాణలో ఇవాళ కొత్తగా 11 కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వ్లెడిరచింది. నమోదైన కేసున్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసు 1107కి చేరాయి. ఇవాళ 20 మంది బాధితు కరోనా నుంచి కోుకొని డిశ్చార్జ్‌ కాగా.. మొత్తంగా 648 మంది కరోనా మహమ్మారి నుంచి కోుకున్నారు. ఇప్పటివరకు కరోనా మహమ్మారికి 29 మంది ప్రాణాు కోల్పోగా.. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 430 మంది చికిత్స పొందుతున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.మరోవైపు వరంగల్‌ రూరల్‌, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని ఆరోగ్య శాఖ వ్లెడిరచింది. కరీంనగర్‌, రాజన్న సరిస్లి, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, మెదక్‌, జయశంకర్‌ భూపాపల్లి, సంగారెడ్డి, నాగర్‌కర్నూు, ముగు, పెద్దపల్లి, సిద్దిపేట, మహబూబాబాద్‌, మంచిర్యా, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్‌, నల్గొండ, కుమరంభీం అసిఫాబాద్‌, ఖమ్మం, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, సూర్యాపేట, నారాయణపేట జిల్లాల్లో గత 14 రోజుగా ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

తాజావార్తలు