హైదరాబాద్ దేశానికే గర్వ కారణం
– అభివృద్ధిలో ఇరు రాష్ట్రాలు పోటీపడాలి
– ఉలికి పుస్తకావిష్కరణలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
హైదారబాద్,జులై3(జనంసాక్షి):
హైదారాబాద్ సకల సంస్కృ తుల నగర మని, ఇది తెలుగువారికే కాకుండా దేశ ప్రజలకు కూడా తలమానికంగా ఉం దని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. తెలం గాణ అంశంతో తనకు సంబం ధం ఉందని….కానీ ఆ విషయాలేవీ చెప్పలేనని రాష్ట్రపతి అన్నారు. శుక్రవా రం మహారాష్ట్ర గవర్నర్ విద్యా సాగర్‌రావు రచించిన ఉనికి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరుగుపొరుగు రాష్ట్రాలు కలసి అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. అదే విధంగా దేశాభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేయాలని ఆయన సూచిం చారు. హైదరాబాద్ రాజధాని మాత్రమే కాదు..విద్యా కేంద్ర మన్నారు. సైబర్ సి టీ…ఆధునిక నాగరికతకు కేంద్రమని తెలిపారు. దేశంలోని అన్ని ప్రాం తాల వారు హైదరాబాద్‌లో ఉన్నారని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. పుస్తకం మొదటి ప్రతిని రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ అందజేశారు. అనంతరం ప్రణబ్ ముఖర్జీ మాట్లాడు తూ… ఉనికి పుస్తకం రచించిన విద్యాసాగర్‌రావుకు నా అభినం దనలు. పుస్తకావి ష్కరణకు తను పిలవడం ఆనందంగా ఉంది. విద్యా సాగర్‌రావు పార్లమెంట్ సభ్యుడైనప్పటి నుంచి బాగా తెలుసన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పాయి పార్లమెంట్ విలువలు కాపాడారు. ప్రజా ప్రయో జనాల కోసం తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో కలిసి పనిచే యాలన్నారు. పొరుగు వారితో కలిసిమెలిసి జీవించాలి. హైద రాబాద్ దేశానికి చాలా ము ఖ్యమైన నగరం. సైబర్‌సిటీ, హైటెక్ సిటీ ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీకి నెలవు. హైదరాబాద్ ఇప్పుడు ఎడ్యుకే షన్ హబ్‌గా మారిందన్నారు. ప్రధాని మోడీ కూడా దేశాభివృద్దికి మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్వచ్ఛభారత్ వంటి ఎన్నో కార్యక్రమలు చేపట్టారని, ఇవన్నీ కూడా దేశాభివృద్దిని కాంక్షించి సచేస్తున్నవేనని అన్నారు. ఈసందర్భంగా మహారాష్ట్ర గవర్నర్ విద్యా సాగ రరావు మాట్లాడుతూ… రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషం కలిగించిందన్నారు. రాష్ట్రపతి పుస్తకాన్ని ఆవిష్కరించడం ద్వారా ఉనికికే ఉనికి ఏర్పడిందన్నారు. ఇక్కడికి పెద్దలందరూ రావడమే ఓ విశ ేషమని, 2ఈ పుస్తకంలో పెద్దగా విశేషాలేవిూ లేవన్నారు. మహారాష్ట్రలో రాష్ట్ర పతితో పాటు పలు కార్య క్రమాల్లో పాల్గొనే అదృష్టం కలిగిందన్నారు. ఉనికి పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ హెచ్‌ఐసిసిలో ఘనంగా జరిగిం ది. కార్య క్రమంలో ఉమ్మడి గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ సీఎల్పీ నేత జానా రెడ్డి, ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యాసాగర్ రావు రాజకీయ జీవితం, విద్యాబ్యాసం తదితరాలపై లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. తొలి ప్రతిని ఆవిష్కరించిన కేసీఆర్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందించారు. పుస్తకంలో విద్యాసాగర్ రావు రాసిన పలు వ్యాసాలు, అనుభవాలు
పొందపర్చారు.
విద్యాసాగరరావు అనుభవశీలి : కేసీఆర్
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ… దేన్నై నా చిరునవ్వుతో స్వీకరించి ముందుకెళ్లే మనస్తత్వం విద్యాసాగరరా వుద న్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయనతో అభిప్రాయాలు పంచుకుంటూ కలిసి పనిచేశామని గుర్తు చేశారు. విద్యాసాగరరావు జీవితంలో రాజకీయ, పోరాట, సిద్దాంత అనుభవాలున్నాయన్నారు. విద్యాసాగర్‌రావు జీవితం పోరా టలతో ముడిపడి ఉంది. ఆయన విలక్షణమై రాజకీయ నాయకుడు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా నమ్ముకున్న సిద్ధాంతం కోసం కట్టుబడి ఉంటారని కొనియాడారు. ఉద్యమ కాలంలో విద్యాసాగర్‌రావుతో కలిసి పని చేసే అవకా శం కలిగిందని గుర్తు చేసుకున్నారు.బతికున్నప్పుడే రాష్ట్రాన్ని సాధించిన ధన్య జీవిగా ప్రణబ్‌ముఖర్జీ నన్ను ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర బిల్లు విూద ప్రణ బ్‌ముఖర్జీ సంతకం చేయడం మన అదృష్టం. రాజ్యసభలో బిల్లు పాస్ అయినప్పుడు మేం పొందిన ఆనందం వెలకట్టలేనిదన్నారు. విద్యాసాగరరావు ఉనికి పుస్తకావిష్కరణ సభలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీపై తెలంగాణ సిఎం కే సీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. తెలంగాణ ఏర్పాటు బిల్లుపై సంతకం చేసిన ప్రణబ్ ముఖర్జీని ఈ రాష్ట్రప్రజలు ఎన్నటికీ మరువలేరని కొనియా డారు. రాష్ట్రపతిగా ఆయన బిల్లుపై సంతకం చేయడం తెలంగాణ ప్రజల అ దృష్టమని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ఎంతో మేథోసంపన్నులని, ఆయనకు ప్రతివిషయంపైనా అవగాహన ఉందన్నారు. పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని కేసీఆర్ రాష్ట్రపతి ప్రణబ్ కు అందించారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిమ సంస్థ నిర్వహించింది.
అస్తిత్వం ముఖ్యం: దత్తాత్రేయ
అస్తిత్వం లేకుంటే వ్యక్తిత్వం ఉండదని దత్తాత్రేయ అన్నారు. విద్యాసాగర్‌రావు ఆలోచనా విధానమే ఆయనకు గుర్తింపు తెచ్చిందని కొనియాడారు. విద్యాసాగర్‌రావు మహారాష్ట్ర గవర్నర్ కావడం సంతోషంగా ఉందన్నారు. ఆయనతో కలసి పనిచేసిన అనుభవం తనదన్నారు. ఆయన నిబద్దత కలిగిన నాయకుడన్నారు. తన అనుభవాలను ఇందులో పొందుపర్చడం, ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించడం అదృష్టమన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలను పటిష్టం చేయాలి: జానా
ప్రజాస్వామ్య సంస్థలన్నింటినీ పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ప్రతిపక్ష నేత జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ఉనికి పుస్తకావిష్కణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గవర్నర్ విద్యాసాగర్‌రావుతో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. బలహీన పడుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థకు ఉనికి పుస్తకం కొత్త శక్తినిస్తుంది. ప్రజాస్వామ్యం ఉనికి కోల్పోకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.