హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్,ఆగస్టు28 : హైదరాబాద్ లో ఓ కార్ కేర్ సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో షెడ్డులోని నాలుగు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సికింద్రాబాద్, అల్వాల్ కాణాజిగూడా డెయిరీ ఫాం రోడ్డులోని కార్‌కేర్ సెంటర్ షెడ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.