హైదరాబాద్ ఒక మినీ ఇండియా – మీట్ ది ప్రెస్ లో మంత్రి కేటీఆర్
హైదరాబాద్ ఒక మినీ ఇండియా అన్నారు మంత్రి కేటీఆర్. నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్ లో మంత్రి పాల్గొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్ సమస్యల వలయంలో చిక్కుకుపోయిందన్నారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధి ఐదేళ్లలో చేసి చూపిస్తామన్నారు.