హైదరాబాద్ తిరుగు ప్రయాణానికి ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లిన ప్రయాణికులతో పాటు నగరానికి వచ్చిన వారు తిరిగి వెళ్లేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయని సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ గురువారం తెలిపారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
- కాకినాడ-సికింద్రాబాద్ (07076): 17న సాయంత్రం 4.45 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.50కి సికింద్రాబాద్ చేరుకుంటుంది.
- విజయవాడ-సికింద్రాబాద్ (072076): శుక్రవారం(15న) రాత్రి 11 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి శనివారం ఉదయం 5.40కి సికింద్రాబాద్ చేరుకుంటుంది.
- కాకినాడ-తిరుపతి (07431/07432): శుక్రవారం(15న) సాయంత్రం 4.45 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి శనివారం ఉదయం 7.10కి తిరుపతికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 16న సాయంత్రం 7 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కాకినాడ చేరుకుంటుంది.
- సికింద్రాబాద్-విజయవాడ (07208): 18న ఉదయం 6.30కు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి అదేరోజు మధ్యాహ్నం 1.30కు విజయవాడ చేరుకుంటుంది.
- తిరుపతి-కాకినాడ (07942): శుక్రవారం(15న) రాత్రి 10.40కి తిరుపతి నుంచి బయల్దేరి మరుసటి రోజు కాకినాడకు చేరుకుంటుంది.
- సికింద్రాబాద్-కాకినాడ (07011): 17న సాయంత్రం 7.15కు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు 5.15కు కాకినాడ వస్తుంది.
- కాకినాడ-సికింద్రాబాద్ (07054): 17న సాయంత్రం 5.45కు కాకినాడ నుంచి బయల్దేరి మరుసటి రోజు 4.30కు సికింద్రాబాద్ వస్తుంది.
- సికింద్రాబాద్-తిరుపతి (02764): 18న రాత్రి 11 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది.
- కాచిగూడ-గుంటూరు డబుల్ డెక్కర్ (02122/02121): 16, 18 తేదీల్లో ఉదయం 9.55కు కాచిగూడ నుంచి బయల్దేరి అదే రోజు సాయంత్రం 5.10కి విజయవాడకు, సాయంత్రం 6.15కి గుంటూరుకు చేరుకుంటుంది. రాత్రి 11 గంటలకు గుంటూరు నుంచి బయల్దేరి రాత్రి 11.50కి విజయవాడకు, మరుసటి రోజు ఉదయం 5.25కి కాచిగూడ చేరుకుంటుంది.
- విశాఖ-సికింద్రాబాద్(08577/08578): 17,18 తేదీల్లో సాయంత్రం 4.45కు విశాఖపట్నం నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.15కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 18,19 తేదీల్లో సాయంత్రం 5.25కు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.50కి విశాఖ చేరుకుంటుంది.