హైదరాబాద్ లో భారీ వర్షం
వాతావరణశాఖ అలర్ట్ ఇచ్చింది. మరో 24 గంటల్లో రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవచ్చని తెలిపింది. చాలా ప్రాంతాల్లో వర్షంతోపాటు ఈదురుగాలులు ఉండొచ్చని హెచ్చరించింది. తెలంగాణ మీదుగా రాయలసీమ, దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. ఇక రైతులు ముందుజాగ్రత్తలు తీసుకోవాలని కోరింది వాతావరణ శాఖ. మార్కెట్ యార్డుల్లోని ధాన్యంను తడవకుండా జాగ్రత్త పడాలని సూచించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు ఉంటాయని.. పొలాల్లోని వ్యక్తులు చెట్ల కిందకు వెళ్లొద్దని సూచించింది.
హైదరాబాద్ లో వర్షం
ఉక్కబోత ఎండతో ఉక్కిరిబిక్కిరి అయిన హైదరాబాదీలు.. మధ్యాహ్నం నుంచి చల్లబడ్డారు. చాలా ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఆకాశం మేఘావృతం అయ్యింది. చిరుజల్లులతో ఆహ్లాదంగా మారింది. ఎల్బీనగర్, వనస్థలిపుర, హయత్ నగర్, పెద్ద అంబర్ పేట్, నాగోల్, బిఎన్ రెడ్డి నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వర్షం పడుతుంది.