హైదరాబాద్ హుక్కా సెంటర్లలో అమ్మాయిలు…

హైదరాబాద్‌: నగరంలోని నారాయణగూడ పరిధిలోని పలు హుక్కా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించగా అమ్మాయిలు పట్టుబడ్డారు. హుక్కా తాగుతూ 16 మంది అబ్బాయిలు, వారితో పాటున్న ఆరుగురు అమ్మాయిలు అడ్డంగా దొరికిపోయారు. వీరందరూ వివిధ కాలేజీల్లో చదువుకుంటున్న వారు కావడంతూ, కేసులునమోదు చేయకుండా, వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. ఇదే సమయంలో నిబంధనలకు విరుద్ధంగా హుక్కా సెంటర్లను నిర్వహించడంతో పాటు, మైనర్లకు ప్రవేశం కల్పించినందుకు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయనున్నట్టు పేర్కొన్నారు.