హోంమంత్రే నిర్ణయించుకోవాలి: జేసీ

హైదరాబాద్‌, జనంసాక్షి: పదవికి రాజీనామా చేయాలా వద్దా అనేది హోంమంత్రి సబిత నిర్ణయించుకోవాలని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. వరుసగా మంత్రులపై అభియోగాలు దాఖలు కావడం దురదృష్టకరమన్నారు. సహచరుల ఇబ్బందులను చూసి బాధతోనే ఆనం అలాంటి వ్యాఖ్యలు చేశారని అభిప్రాయపడ్డారు. సాధారణంగా ముఖ్యమంత్రి చెప్పినట్టే మంత్రులు నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. అయితే ఒకటి రెండు అంశాలు నచ్చక తాను నిర్ణయాన్ని అప్పటి సీఎం వైఎన్‌కే వదిలేశానని జేసీ చెప్పారు.