హోటల్ మీద ఉగ్రవాదుల దాడి: 17 మంది దుర్మరణం
సోమాలియా: సోమాలియా రాజధాని మోగాధిషులోని హోటల్ మీద ఉగ్రవాదులు పంజా విసిరారు. ఉగ్రవాదులు దాడిలో సోమాలియా దేశ రాయబారితో సహ 17 మంది మరణించారని శనివారం అధికారులు తెలిపారు. మోగాధిషు నగరంలో ప్రసిద్ది చెందిన హోటల్స్, వ్యాపార కేంద్రాలు, పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. ఈ నగరంలోని మక- ఆల్-ముకర్ మహ్ అనే హొటల్ వెనుక గేట్ దగ్గర శుక్రవారం కారులో వచ్చిన ఉగ్రవాది (మానవ బాంబు) తనను తాను పేల్చేసుకున్నాడు. ఆ సమయంలో సెక్యూరిటి సిబ్బంది, పోలీసులు అక్కడికి పరుగు తీశారు. అదే సమయంలో ఒక్క సారిగా ఉగ్రవాదులు హోటల్ లోకి ప్రవేశించారు. తరువాత ఉగ్రవాదులు తుపాకులు తీసుకుని హొటల్ లోపల ఉన్నవారి మీద ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపారు. హోటల్ మీద ఉగ్రవాదుల దాడి: 17 మంది దుర్మరణం హోటల్ లో ప్రభుత్వ అధికారులు, వ్యాపారులు, పర్యాటకులు ఉన్నారు.సెక్యూరిటి సిబ్బంది హోటల్ దగ్గరకు చేరుకుని ఉగ్రవాదులను పట్టుకొవడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో సెక్యూరిటి సిబ్బంది ఉగ్రవాదుల మద్య ఎదురు కాల్పులు జరిగాయి. శనివారం మద్యాహ్నం రెండు గంటల వరకు హోటల్ నుండి 9 మంది మృదేహాలను బయటకు తీశామని, ఈ దాడిలో 17 మంది మరణించారని మోగాధిషు నగర పోలీసు అధికారి క్యాప్టెన్ మహమ్మద్ హుస్సేన్ తెలిపారు. మిగిలిన మృదేహాలను బయటకు తియ్యడానికి ప్రయత్నిస్తున్నామని వివరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, హోటల్ లో ఉగ్రవాదులు ఎంత మంది ఉన్నారు, వారు ఎందరిని నిర్బందించారు అని అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. హోటల్ మీద ఉగ్రవాదుల దాడి: 17 మంది దుర్మరణం ఆల్-షబబ్ అనే ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఈ దాడులు చేసింది మేమే అని ప్రకటించుకునింది. ఆల్-ఖైదా ఉగ్రవాదులతో ఆల్-షబబ్ సంస్థకు సంబంధాలు ఉన్నాయి. గతంలో వీరు సోమాలియా దేశంలోని పర్యాటక కేంద్రాలు, హోటల్ మీద అనేక దాడులు చేశారు. 2013 సెప్టెంబర్ లో నైరోబియాలో అల్-షబర్ ఉగ్రవాదులు జరిపిన దాడులలో 67 మంది దుర్మరణం చెందారు. ఇదే సంవత్సరం ఫిబ్రవరి నెలలో సెంట్రల్ హోటల్ లో జరిగిన దాడిలో వ్యాపారులు, అధికారులతో పాటు 25 మంది దుర్మరణం చెందారు.