హోబార్ట్ లో టేలర్ సెంచరీ, రికార్డ్

హోబార్ట్ లో ఐర్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో జింబాబ్వే ఆటగాడు బ్రెండాన్ టేలర్ సెంచరీ కొట్టాడు. 35వ ఓవర్ చివరి బంతితో టేలర్ సెంచరీ పూర్తయ్యింది. ఈ సెంచరీతో టేలర్ మరో కొత్త రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో 5 వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో జింబాబ్వే ఆటగాడిగా రికార్డులకెక్కాడు.ఇప్పటి వరకు నాలుగు వికెట్ల నష్టానికి జింబాబ్వే 200 పరుగులు చేసింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. జింబాబ్వేకు 332 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది.