హౌసింగ్, కార్ల రుణాల మంజూరు
ఖమ్మం, నవంబర్ 3 : ఈ నెల 25న తమ కార్యాలయ అవరణ మందు హౌసింగ్ రుణాలు, కార్ల రుణాల మంజూరుకై రుణమేలా నిర్వహించనున్నట్లు స్టెట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ జుబ్లిపుర మెయిన్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి శనివారం నాడు ఇక్కడ తెలిపారు. గతంలో నిర్వహించిన కార్లోన్ మేళాకు కంపెనీలు వినియోగదారుల నుంచి మంచి స్పందన లభించినట్లు తెలిపారు. అలాగే ఈ నెల 25న తమ బ్రాంచి ఎదుట ఏర్పాటు చేస్తున్న కాయిన మేళాను సద్వినియోగం చేసుకోవాలని చీఫ్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి సూచించారు. ఒక రూపాయి, రెండు రూపాయల, పది రూపాయలు నాణెములను కాయిన్ మేళాలో ఇస్తున్నట్లు తెలిపారు.