హ్యూస్టన్‌లో భారీతీయలు అవస్థ
హ్యూస్టన్,ఆగస్ట్30 : వరుసగా నాలుగోరోజు కూడా టెక్సాస్‌లో కుండపోత వర్షాలు కురిశాయి. సహాయం కోసం అర్థిస్తున్నవారిని కాపాడటానికి సహాయక బృందాలకు భారీ వర్షాలు ఆటంకంగా మారాయి. మరోవైపు అతిభారీ వర్షాలు కురవనున్నాయని జాతీయ వాతావరణ విభాగం హెచ్చరించింది. వాతావరణం తెరిపిస్తే 30 వేల మందిని శిబిరాలకు తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు హూస్టన్, చుట్టుపక్కల నివసిస్తున్న దాదాపు లక్షమంది భారతీయులు వరదల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం శిబిరాల్లో 5500 మంది ఉన్నట్లు హూస్టన్ మేయరు సిల్విస్టర్ టర్నర్ చెప్పారు. వరదనీటి ఉద్ధృతికి నలుగురు చిన్నారులు సహా ఇద్దరు వృద్ధులు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వరద పరిస్థితిని సవిూక్షించారు. భారతీయుల సహాయార్థం ప్రత్యేక ఫోన్ నంబరు: సహాయం కావాల్సిన భారతీయులు 18322311988లో సంప్రదించాలని హూస్టన్‌లో భారత కాన్సుల్ జనరల్ అనుపమ్ రే ట్వీట్ చేశారు. 200 మందికిపైగా భారతీయ విద్యార్థులకు మనదేశ రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో వసతి, ఆహారం ఏర్పాటు చేశారు. సెయింట్ జోసెఫ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిఖిల్ భాటియా, షాలిని అనే ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగానే ఉంది. నిఖిల్ అమ్మ సుమన్ భాటియా మంగళవారం అమెరికా చేరుకున్నారు. షాలిని సోదరుడు బుధవారం చేరుకోనున్నారు.