స్కాట్లాండ్‌పై బంగ్లాదేశ్ విక్టరీ
వరల్డ్ కప్‌లో ఆసియా అండర్ డాగ్స్ బంగ్లాదేశ్ సెకండ్ విక్టరీ కొట్టింది. పూల్-ఏలో స్కాట్లాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో బంగ్లా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ లోని నెల్సన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 318 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర కోట్జర్ 156 పరుగులతో రాణించాడు. తర్వాత టార్గెట్ ఛేజింగ్ లో బంగ్లా అదరగొట్టింది. మరో 11 బంతులు మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 95 పరుగులతో రాణించగా… మహ్మదుల్లా, రహీమ్, షకీబుల్ హాసన్ హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. వరల్డ్ కప్‌లో బంగ్లాకు ఇదే హైయ్యెస్ట్ ఛేజింగ్ విక్టరీ. ఈ విజయంతో పూల్-ఏ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.