నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పరితపించిన మహా నాయకుడుYSR

వైయస్సార్ 13వ వర్ధంతి ఘనంగా నివాళులర్పించారు

ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 13వ వర్ధంతి సందర్భంగా చెన్నూరు పట్టణంలోని బోడ జనార్ధన్ గారి కాంగ్రెస్ క్యాంపు కార్యాలయం లో వైయస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు జూల లక్ష్మణ్ మాట్లాడుతూ సబ్బండ వర్గాల కొరకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న రైతన్నలు ,పేద ప్రజల ,విద్యార్థుల కష్టాలు తీర్చేందుకు…
రైతు ఋణమాఫీ,
ఉచిత విద్యుత్,
ఆరోగ్య శ్రీ,
108 అంబులెన్స్ 🚑,
ఫీజు రీయింబర్స్మెంట్,
డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ,
పెన్షన్ లు,
ఇందిరమ్మ ఇండ్లు,
జలయజ్ఞం…
ఇలాంటి ఎన్నో పథకాలను తన అమ్ముల పోదిలో నుంచి తీసి చరిత్ర సృష్టించిన నిరంతర ప్రజా సేవకుడు వైయస్సార్ అని కొనియాడారు ఈ కార్యక్రమంలో జూల లక్ష్మణ్…చల్ల భాస్కర్ రెడ్డి….ఎం డి బషీరుద్దీన్ …..పోగుల పురుషోత్తం….కాలేశ్వరం రాజా గౌడ్ ….చెడ అశోక్ …..జుట్టు బాపు…కొల్లూరు లక్ష్మణ్….రాజా మోహన్ రావు….బుర్ర రామ గౌడ్ ….నక్క బాలయ్య ….ఎం డి రాజు…రోడ్డ సది….పింటూ తదితరులు పాల్గొన్నారు