01పి, నిరసన చేపట్టిన విఆర్ఏలు
తహసిల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏల నిరసన
స్టేషన్ ఘన్పూర్, జూన్ 30, ( జనం సాక్షి) :
డివిజన్ కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు పాలెపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి జయరాజు మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్య లపై గతమూడు అసెంబ్లీ సమావేశాలలోమాటిచ్చి నేటి వరకుకూడాఅమలు చేయకపోవడం వీఆర్ఏ ల జీవితంలో ఆందోళన కలిగిస్తుందని అన్నారు. అర్హత గల వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పిస్తూ పే స్కేల్ వర్తింప చేస్తామని , 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగం కల్పిస్తా మని నిండుఅసెంబ్లీసాక్షిగా ముఖ్యమంత్రి మూడు సార్లు చెప్పి 3 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏ ల సంఘం మండల అధ్యక్షుడు పాలెపు శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి ఎలిశాల రాము, సెక్ర టరీ వెంకటయ్య, కోశాధికారి సాంబశివ, సభ్యులు యాదేశ్, రమ్యజ్యోతి,రాజేశ్వరి,అభి,వెం