02పి, ఆర్టీసీ ఇస్తున్న రాయితీల పై కళా ప్రదర్శన
ఆర్టీసీ ఇస్తున్న రాయితీల పై కళా ప్రదర్శన
స్టేషన్ ఘన్పూర్, జూన్ 30,( జనం సాక్షి) :
డివిజన్ కేంద్రంలోని ఘన్పూర్ బస్టాండ్ నందు ఆర్టీసీ కళాబృందం గురువారం రోజు కళా ప్రదర్శ న ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ వరంగల్ 1డిపో మేనేజర్ వంగాల మోహన్ రావు ఆదేశానుసారం ఘన్పూర్ బస్టాండ్ నందు కళా ప్రదర్శన నిర్వహిం చారు. ప్రదర్శనలో ఆర్టీసీ ఇస్తున్న రాయితీలు, పథకాల గురించి ఇన్సూరెన్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం,ప్రైవేటు వాహనం ప్రయాణం ప్రమాదకరమని ప్రజలకు తెలియజేశా రు. టీఎస్ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందనినాటికల ద్వారా పాటల ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ బస్టాండ్ కంట్రోలర్ రఘువీర్, కళాబృందం టీం లీడర్ సాంబయ్య, రాజు,శంకర్,భాస్కర్,కుమార్, శ్రీనివాస్, వెంకట్ స్వామి,ఎల్లస్వామి తదితరులు పాల్గొన్నారు.