1న ఉద్యోగుల విధుల బహిష్కరణ
నిజామాబాద్, అక్టోబర్ 26 : నవంబర్ ఒకటిన ఉద్యోగులు విధులు బహిష్కరించి సహాయ నిరాకరణ పాటిస్తారని టిఎన్‌జివోస్ జిల్లా అధ్యక్షుడు గంగారాం తెలిపారు. అదే రోజు వేయ్యి మంది ఉద్యోగులతో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామన్నారు. ఉద్యోగులపై వేసిన కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.గంగారాం శుక్రవారం స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. ఇటీవల హైదరాబాద్‌లో తెలంగాణ మార్చ్ సందర్బంగా మృతి చెందిన రాజారెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యోగులు నవంబర్ 1 నుంచి తొమ్మిది వరకు నిరసన కార్యక్రమాలు చేపడతారన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని టిఆర్‌సి విషయంలో చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గంగారాం వెంట టిఎన్‌జివోస్ నాయకులు కిషన్, వేణు, శివ, మారయ్యగౌడ్ తదితరులు ఉన్నారు.