1న విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం
ఖమ్మం, జూలై 30 : ఖమ్మం పట్టణంలోని టీటీడీసీ భవనంలో వచ్చే నెల 1న విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ సిద్ధార్థ జైన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధానికి సంబంధించిన అంశాలను ఈ సమావేశంలో సమీక్షిస్తామని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 15 నుంచి జూలై 15 వరకు సంబంధించిన అంశాలపై కమిటీ సమీక్షిస్తున్నట్టు, అధికారుల నివేదికలను సాంఘిక సంక్షేమ డీడీ కార్యాలయానికి పంపాలని ఆయన సూచించారు.