10న ఇందిరమ్మ బాట
ఖమ్మం, జూలై 27 : రాష్ట్రంలో జరుగుతున్న ఇందిరమ్మ బాటలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఖమ్మం జిల్లాలో ఆగస్టు రెండో వారంలో పర్యటించనున్నారు. జిల్లాలో మూడు రోజుల పాటు గడపనున్న ముఖ్యమంత్రి అయిదు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. తొలుత ఆగస్టు 10న జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి అదేరోజు పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. 11న కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. 12న జిల్లా కేంద్రమైన ఖమ్మం పట్టణంలో అన్ని ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ ఖమ్మం జిల్లా పర్యటన అధికారికంగా ఖరారవ్వడంతో జిల్లా అధికార యంత్రాంగం ఆ దిశగా ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైంది.