10వ్యవహార శైలి తోనే ఏసీబికి పట్టుబడ్డాడా..?
అందరి కోసమే ఎక్కువ మొత్తం డిమాండా? సత్యనారాయణ రెడ్డి బలి…
ఆముదాలపల్లి లో చర్చ…
శంకరా పట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 2
చేసే ఉద్యోగం ప్రజా సంబంధముతో కూడింది కావడంతో ప్రతి వ్యక్తితో ప్రేమ అనురాగాలతో మాట్లాడి. ప్రజా సమస్యలు తీర్చాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు, కొంతమంది నియంతగా వ్యవహరిస్తున్నారని మండలంలో ఆరోపణలు ఉన్నాయి. గురువారం శంకరపట్నం మండలం ఆముదాల పల్లి పంచాయతీ కార్యదర్శి కర్ర సత్యనారాయణరెడ్డిని మణికంఠ క్వారీ యజమాని వీరమనేని కిషన్ రావు పట్టివ్వడంతో, గ్రామంలో మండలంలో ప్రజలు, అధికారులు వివిధ రకాలుగా చర్చించుకుంటున్నారు. ఓ క్వారీ యజమాని వద్ద కేవలం 10 వేల రూపాయలు డిమాండ్ చేయడంతో, ఆ క్వారీ యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించడంతో, గ్రామంలో శుక్రవారం గ్రామస్తులు, తోటి ఉద్యోగులు, సత్యనారాయణ రెడ్డి ఇతర వ్యక్తుల కోసం క్వారీ యజమానిని గతంలో కూడ ఇబ్బందులకు గురిచేసి లక్షల రూపాయలను ఇప్పించినట్లు ఆముదాల పల్లి గ్రామంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ జూనియర్ పంచాయతీ కార్యదర్శి కర్ర సత్యనారాయణ రెడ్డి ఏసీబీ అధికారులకు పట్టు పడడంతో తాసిల్దార్, కార్యాలయం, కేశవపట్నం పోలీసులపై ఏసీబీ ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. గత ప్రభుత్వాల కంటే ప్రత్యేక రాష్ట్రంలోనే అవినీతి పెరిగిపోయి సామాన్య ప్రజలకు అనేక ఇబ్బందులు నష్టాలు జరుగుతున్నట్లు బాధిత ప్రజలు చెప్పుచున్నారు. ఆముదాల పల్లిలో మాత్రం కారు యజమాని వద్ద ఎక్కువ మొత్తంలో అందరికోసం సత్యనారాయణ రెడ్డిని ముందు పెట్టి, క్వారీ యజమాని ఇబ్బందులకు గురి చేయడంతో, ఇబ్బందులకు గురైన క్వారీ యజమాని వీరమనేని కిషన్ రావు ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు ఆముదాలపల్లి గ్రామ ప్రజలు తెలిపారు.