10వ తరగతి తప్పిన గిరిజన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
ఖమ్మం, జూలై 5 (జనంసాక్షి):
పదవ తరగతి తప్పి ఖాళీగా ఉంటున్న గిరిజన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారిని ప్రగతివైపు మళ్లిస్తామని ఐటిడిఎ పిఓ ప్రవీణ్‌కుమార్, డిడి సరస్వతి తెలిపారు. 2009-10, 2010-11, 2011-12 సంవత్సరాలలో పదవ తరగతి తప్పిన విద్యార్థులకు 9 నెలల పాటు శిక్షణ ఇస్తామన్నారు. ఈ నెల 15 నుండి తరగతులు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. మొదటి మూడు నెలలు సబ్జెక్టులపై అవగాహన, మరో మూడు నెలలు స్పోకెన్‌్ ఇంగ్లీష్, చివరి మూడు నెలలు యోగ, కంప్యూటర్, క్రీడలపై శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణాకాలంలో ఉచిత భోజన వసతితో పాటు దస్తులు, కాస్మోటిక్, దుప్పట్లు, ట్రక్‌పెట్టెలు, ప్లేట్లు అందిస్తామన్నారు.