10 మంది విద్యార్థులకు గాయాలు
నిజామాబాద్: నిజమాబాద్ జిల్లా వర్నిమండలం గోవూరు వద్ద సోమవారం ఉదయం ఓ ప్రైయివేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది, ఈ ప్రమాదంలో పదిమంది విద్యార్థులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.