10 శాతం జీఓ విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు గిరిపుత్రులు కృతజ్ఞతలు…..
జనగామ( జనం సాక్షి)అక్టోబర్1: జనగామ లంబాడీల సమక్షములో రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్ర శేరార్ రావు చిత్ర పటానికి పుష్పాభిషేకము మరియు పాలాభిషేకము చేయడము జరిగింది.
ఉమ్మడ ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నప్పటి నుండి, గత కొన్ని సంవత్సరాలుగా, ఎస్టీ జాబితాలోని సుమారు 33 ఉపకులాలు గల గిరిజనులు ఒక్కొక ఉపకులాల వారిగాను “సంఘాలుగా” ఎర్పాడి, తమ తండాలు, గూడాలు, పేటలు, మరియు చిన్న చిన్న పల్లెలు గ్రామ పంచాయితీ లు కావాలని, రిజర్వేషన్ శాతము ను 6శాతం. నుండి 10శాతం నికి పెంచాలని, మా కులాల గిరిజనులు ‘ఆత్మగౌరవంతో ఉండేటట్లు హైదరాబాద్ నడి బొడ్డున గిరిజనుల చిహ్నముగా “గిరిజన భవన్లు కావాలని, వీరోచిత పోరాటలు చేయడము జరిగింది. ఎన్ని ప్రభుత్వాలు మారిన మా తలరాత మారలేదు.
దీనికి ఏకైక మార్గం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు అని నినదించి, ఉద్యమించి కేసీఆర్ అడుగుజాడలో నడచి, నిలబడి, కలబడి, మొట్టమొదటి బలి దానము మా గిరిజన బిడ్డదే కావడము,
ఆ తదుపరి తెలంగాణా రాష్ట్రము ఏర్పాటు చేయడం జరిగింది. జనహృదయి – నేత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తదుపరి ఒక్కొక్క
అంశాలును, సమస్యలను పరిష్కరించడము చేస్తూ,
1)గ్రామ పంచాయితీలు, 2) గిరజన భవన్ ల ఏర్పాటు.
3) 10శాతం రిజర్వేషన్ కల్పంచడము జరిగింది. కావున మా గిరిజన జాతి ఎన్నడు మరవదు. కెసిఆర్ దేశ చరిత్రను తిరగరాయాలని
వారి వెంటే ఈ గిరిపుత్రులు ఉంటారని తెలియజేస్తూ,
నాయకులందరూ కెసిఆర్కు కృతజ్ఞతలు తెలియ జేశారు.
ఈ కార్యక్రమములో అజ్మీర స్వామి నాయక్ ,
స్థానిక కౌన్సిలర్ అనిత, మూడ లక్ష్మన్ నాయక్,వాసు నాయక్, హరిలాలాల్ నాయక్, కిషన్, గోర్సింగ్, లాచిరామ్ , నాగేందర్, సీతారాం, ధర్మభిక్షం, మీట్యానాయక్, వెంకన్న, లక్ష్మన్, హరిసింగ్ సుమారు వంద మంది పాల్గొన్నారు.