10, 11 తేదీల్లో శాసనసభ కమిటీ పర్యటన
ఖమ్మం, అక్టోబర్ 9 : షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి ఏర్పాటైన శాసనసభ కమిటీ ఈ నెల 10, 11 తేదీలలో ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్టు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. పదో తేదీ ఉదయం పది గంటలకు సింగరేణి అధికారులతో సమీక్షా సమావేశం, 3 గంటలకు మనుగూరు పరిసర ప్రాంతాలలో హాస్టళ్లను, తండాలను సందర్శిస్తారని చెప్పారు. 11వ తేదీ ఉదయం 9 గంటలకు భద్రాచలంలో సీతారామచంద్రస్వామి దేవాలయం ఈఓతో సమావేశం, 11 గంటలకు ఐటీడీఏ సమావేశం మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు.