ఈడెన్‌లో నిరాశపర్చిన సచిన్ , 10 పరుగల వద్ద ఔట్
కోల్‌కతా : భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈడెన్‌గార్డెన్స్‌లో జరుగుతున్న తొలిటెస్ట్ మ్యాచ్‌లో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 82 పరుగుల వద్ద సచిన్ (10) ఔటయ్యాడు. విండీస్ బౌలర్ షిల్లింగ్ ఫోర్డ్ మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. రెండో రోజు మ్యాచ్ ప్రారంభమైన గంటన్నర వ్యవధిలో భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సచిన్ పది పరుగులకే ఔటవ్వడంతో అభిమానులు నిరాశ చెందారు.