ఆటోబోల్తా : 10 మంది విద్యార్థులకు గాయాలు
మెట్‌పల్లి (కరీంనగర్ ) : మెట్‌పల్లి వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆప్పత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.