104వ వార్షికోత్సవ సంబరాలు


– రుణాలను నేరుగా పొందండి
– మధ్యవర్తులను ఆశ్రయించవద్దు
– బ్యాంకు మేనేజర్ వాంకుడోత్ విజయ్

డోర్నకల్ నవంబర్ 11 జనం సాక్షి

మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డోర్నకల్ బ్రాంచ్ మేనేజర్ వాంకుడోత్ విజయ్ ఆధ్వర్యంలో 104వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.కేకు కోసి మిఠాయిలు పంచుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యూనియన్ బ్యాంకు సేవలను అర్హులైన అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కర్షకులు, ఖాతాదారులు రుణ సదుపాయంలో ఇబ్బందులు కలగకుండా నేరుగా తమను సంప్రదించాలని సూచించారు.మధ్యవర్తులను ఆశ్రయించి కష్టార్జితాన్ని కోల్పోవద్దని రైతులకు ఆయన విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వ పరమైన సేవలు అందరికీ అందుబాటులో ఉంటాయని తెలిపారు.అసిస్టెంట్ మేనేజర్ రమణమూర్తి,ఫీల్డ్ ఆఫీసర్ ప్రదీప్,ఆఫీసర్ సుధాకర్,బేబీ,రమేష్,సిబ్బంది శ్రీనివాస్ యాదవ్,అంజి ఖాతాదారులు తదితరులు ఉన్నారు