1099 మండల సమాఖ్యలకు 135 కోట్ల రుణాలు

ఆదిలాబాద్‌, జూన్‌ 30: రాష్ట్రంలోని మండల సమాఖ్యలకు 135 కోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేశామని స్త్రీ నిధి బ్యాంక్‌ రాష్ట్ర ఏజీఎం రవికుమార్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 1099 మండల సమాఖ్యలకు ఈ రుణాలను అందజేశామని అన్నారు. 220 కోట్లు స్త్రీనిధి బ్యాంకులో జమ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని ఇందులో ప్రభుత్వ వాట 110 కోట్లు కాగా మండల సమాఖ్యల ద్వారా 110 కోట్ల వాట ధానాన్ని సేకరించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటివరకు 50 కోట్లు జమ చేయడం జరిగిందని, జిల్లాకు 11.95 కోట్ల రుణాలను అందజేశామని అన్నారు. స్వశక్తి సంఘాలకు 48 గంటలలోగా రుణాలు అందజేయడం జరుగుతుందని, మొబైల్‌ ద్వారా సమాచారం అందిస్తే రుణాలు బ్యాంకుల్లో జమ అవుతాయని అన్నారు. సక్రమంగా రుణాల చెల్లించిన సంఘాలకు పావల వడ్డీ కింద రుణాలు అందజేస్తామని అన్నారు.